నేను చేస్తున్న ప్రయత్నం……….
ముందుగా భాష అలవడాలంటే వ్యాకరణం చక్కగా తెలిసి ఉండాలి. కాని ఈ రోజుల్లో వ్యాకరణం నేర్చుకుని తదనుగుణంగా మాట్లాడే వాళ్ళెందరు. కొందరు మాట్లాడితే అహా! తెలుగు ఇంత బాగుంటుందా అని అనిపిస్తుంది. కాని కొందరు మాట్లాడితే అసలు తెలుగు రాష్ట్రంలో ఎందుకు పుట్టాంరా బాబూ! అని నెత్తి నోరు కొట్టుకొనే వారు కూడా ఉన్నారు. దీనికంతటికీ కారణం కేవలం తెలుగు భాషపై పట్టు లేకపోవడం, ఏదోలే ఆఁ……. అనే ధోరణి.
పోనీలే …… ఎవరు ఏమనుకున్నా నా ప్రయత్నం నేను చేస్తాను………….
ప్రియ పాఠకులారా !
నేను మొదటగా ప్రారంభిస్తున్న అంశం అసలు తెలుగు అనే పదం ఎలా పుట్టింది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే వాటిని పూర్తిగా అందిస్తున్నాను. అంతే గాకుండా నాకు తెలుసు మీరు ఎక్కడెక్కడో అంతర్జాల వెతుకులాటలో మీరు అలసిపోయి ఒకో చోట ఇవన్నీ లభ్యమయితే ఎంత బాగున్ను అని మీరు ఆలోచించే విషయం అందుకే నా యీ చిన్ని ప్రయత్నం. సహకరిస్తారు కదూ…………………

Leave a Feedback