సంధులు 1234567891011121314151617181920 సంధులు సంధులు పాఠ్యపుస్తకం యొక్క అన్ని పాఠ్యాంశాలలో గల సంధులకు సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా ఈ విభాగంనందు లభిస్తాయు. 1 / 20 Category: సంధులు 1. కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ‘ఆలు’ శబ్దము పరమైనపుడు పూర్వపదం చివర ఉన్న ఆకారానికి వచ్చేది A. ఉకారం B. అకారం C. ఋకారం D. రుగాగమం 2 / 20 Category: సంధులు 2. ఉప + అర్జితము కలిపితే A. ఉపోర్జితము B. ఉపర్జితము C. ఉపార్జితము D. ఏదీకాదు 3 / 20 Category: సంధులు 3. అకారానికి ఏ, ఐలు పరమైతే, ‘ఐ’ కారము, ఓ ఔలు పరమైతే ‘ఔ’ కారము ఏకాదేశముగా వస్తాయి. ఇది ఏ సంధికి సంబంధించిన విషయం A. సవర్ణదీర్ఘ సంధి B. వృద్ధి సంధి C. గుణ సంధి D. యణాదేశ సంధి 4 / 20 Category: సంధులు 4. “ప్రపంచమంతా” – అనే పదాన్ని విడదీసి రాయండి. A. ప్రపంచము + మంతా B. ప్రపంచ + మంతా C. ప్ర + పంచమంతా D. ప్రపంచము + అంతా 5 / 20 Category: సంధులు 5. సత్యోక్తి – విడదీయండి. A. సత్య + ఉక్తి B. సత్యః + ఉక్తి C. సత్యు + ఉక్తి D. సాత్య + ఉక్తి 6 / 20 Category: సంధులు 6. పేశలానందము – విడదీయండి. A. పేశలః + ఆనందము B. పేశలానందః + ము C. పేశల + ఆనందము D. పేశ + అల + నందము 7 / 20 Category: సంధులు 7. దేవాగ్రహారములు – విడదీయండి. A. దేవ + అగ్రహారములు B. దేవఅగ్ర + హారములు C. దేవాగ్ర + హారములు D. దేవన్ + అగ్రన్ + హారములు 8 / 20 Category: సంధులు 8. వర్గపు నాయకుడు – సంధి పేరు తెల్పండి. A. అత్వ సంధి B. ఇత్వ సంధి C. ఉత్వ సంధి D. పుంప్వాదేశ సంధి 9 / 20 Category: సంధులు 9. లులనల సంధికి ఉదాహరణ A. దురాచారాలు B. పాలు C. బీదరాలు D. దీపములు 10 / 20 Category: సంధులు 10. 6. భాగ్యోదయం – సంధి పేరు తెల్పండి. A. అకార సంధి B. యణాదేశ సంధి C. సవర్ణదీర్ఘ సంధి D. గుణ సంధి 11 / 20 Category: సంధులు 11. ఏమది – విడదీయండి. A. ఏమి + అది B. ఏమి + యది C. ఏమి + యయ్యది D. ఏమి + మది 12 / 20 Category: సంధులు 12. “శోకాగ్ని” ఇది ఏ సంధి ? A. సవర్ణదీర్ఘ సంధి B. గుణ సంధి C. వృద్ధి సంధి D. విసర్గ సంధి 13 / 20 Category: సంధులు 13. ఇప్పుడిప్పుడు – ఏ సంధి? A. లులనలసంధి B. ఆమ్రేడితసంధి C. రుగాగమసంధి D. త్రికసంధి 14 / 20 Category: సంధులు 14. పొత్తు విల్లు – ఏ సంధి? A. అత్వసంధి B. ఇత్వసంధి C. ఉత్వసంధి D. గుణసంధి 15 / 20 Category: సంధులు 15. పీచమడచెన్ – సంధి పేరు గుర్తించండి. A. అకార సంధి B. ఉత్వ సంధి C. ఇత్వ సంధి D. గుణ సంధి 16 / 20 Category: సంధులు 16. మహోన్నతము – ఏ సంధి ? A. సవర్ణదీర్ఘసంధి B. గుణసంధి C. యణాదేశసంధి D. త్రికసంధి 17 / 20 Category: సంధులు 17. అమ్మకు పిల్లలపై ప్రేమ అత్యంతము. (అత్యంతము - పదాన్ని విడదీయండి.) A. అ + అంతము B. అత్య + అంతము C. అతి + అంతము D. అత్యంత + అంతము 18 / 20 Category: సంధులు 18. ఇక్కాలము – దీనిని విడదీస్తే A. ఇ + కాలము B. ఇ + క్కాలము C. ఈ + కాలము D. ఏ + కాలము 19 / 20 Category: సంధులు 19. త్రికములు అనగా A. అ, ఏ, ఐ B. అ, ఓ, ఏ C. ఓ, ఔ, అం D. ఆ, ఈ, ఏ 20 / 20 Category: సంధులు 20. లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ? A. లేది + అనక B. లేదో + అనక C. లేదు + అనక D. లేదృ + అనక Your score isThe average score is 65% 0% Restart quiz